నిన్ను తలచి..

Published: Thu,January 10, 2019 12:01 AM
  Increase Font Size Reset Font Size decrease Font size   

అనిల్ తోట దర్శకత్వం వహిస్తున్న చిత్రం నిన్ను తలచి. వంశీ, స్టెఫీ పటేల్ జంటగా నటిస్తున్నారు. నేదురుమల్లి అజిత్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ఇది. తొలి ప్రేమ జ్ఞాపకాలకు అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. ప్రేమలోని కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ దర్శకుడు అనిల్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు అని చెప్పారు. కష్టపడి, ఇష్టపడి మేము చేసిన సినిమా ఇది. టైటిల్ ఆకట్టుకుంటున్నది. నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తిచేసి ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని దర్శకుడు అన్నారు. నటనకు ఆస్కారమున్న పాత్రల్ని పోషిస్తున్నామని నాయకానాయికలు పేర్కొన్నారు.

1249

More News