విజయమే సమాధానం!


Sat,March 23, 2019 11:02 PM

Nikki Tamboli Press Meet on Chikati Gadhilo Chithakottudu Success

తొలి రెండు రోజుల్లోనే మా చిత్రం రెండున్నర కోట్ల వసూళ్లను సాధించింది. యూత్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వినోదం అందరిని ఆకట్టుకుంటున్నది అన్నారు సంతోష్ పి జయకుమార్. ఆయన దర్శకత్వంలో అరుణ్‌ఆదిత్, నిక్కి తంబోలి, హేమంత్, తాగుబోతు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రం ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ సినిమా విషయంలో దర్శకుడిగా చాలా సంతృప్తిగా ఉన్నాను. హారర్, కామెడీ బాగా ఆకట్టుకుంటున్నది అన్నారు. సినిమా విడుదలయ్యే ముందు ఇలాంటి సినిమాలు చేయడం అవసరమా? అని చాలా మంది ప్రశ్నించారు. సినిమా చూడకుండానే ఎన్నో విమర్శలు చేశారు. అలాంటి వారందరికి ఈ విజయం సమాధానంగా నిలిచింది. మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా వర్కవుట్ కాదన్నారు. అయితే అలాంటి కేంద్రాల్లో కూడా చక్కటి ఆదరణ లభిస్తున్నది అని హీరో అరుణ్‌ఆదిత్ తెలిపారు. యూత్‌ను అలరిస్తున్న చిత్రంలో భాగమవడం ఆనందంగా ఉందని కథానాయిక నిక్కి తంబోలి తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

1421

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles