వాట్సప్ నేపథ్యంలో...


Wed,December 12, 2018 11:35 PM

Nikhil,Sahiti Cute Speech C/o WhatsApp Movie Press Meet

నిఖిల్, సాహితి జంటగా నటిస్తున్న కేరాఫ్ వాట్సాప్. అల్లాడి రవీందర్‌రెడ్డి దర్శకుడు. మహాముని ఈవెంట్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై లక్ష్మీకాంత్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్ర గీతాలు ఇటీవల హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ట్రైలర్‌ను దర్శకుడు వి.సముద్ర విడుదల చేయగా, బిగ్ సీడీని నటుడు నోయల్ రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ప్రతి రోజు వాట్సప్‌తోనే మొదలవుతోంది..దానితోనే ముగుస్తోంది. ఈ అంశాన్నే తీసుకుని సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. కథానుగుణంగానే సినిమాకు కేరాఫ్ వాట్సాఫ్ అనే టైటిల్‌ను ఖరారు చేశాం. సరికొత్త నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకముంది అన్నారు. ట్రైలర్ చూస్తే టీనేజ్ లవ్‌స్టోరీ అని అర్థమవుతోంది. యాక్షన్, ఎమోషన్స్ వున్నప్పుడే ఆ సినిమా ఆకట్టుకుంటుంది. ఆవి ఈ చిత్రంలో చక్కగా కుదిరాయి అని సముద్ర తెలిపారు.

1482
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles