అర్జున్ జర్నలిజం


Sat,March 23, 2019 11:44 PM

Nikhil Siddharth Pressmeet About Arjun Suravaram

నిఖిల్ సిద్ధార్థ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం అర్జున్ సురవరం. టి.ఎన్.సంతోష్ దర్శకుడు. రాజ్‌కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో నిఖిల్ సిద్ధార్థ్ మాట్లాడుతూ నేను నటిస్తున్న 16 చిత్రమిది. ఇందులో నేను అర్జున్ సురవరం అనే పవర్‌ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో నటించాను. మీడియాలో ఉన్న సానుకూల, ప్రతికూలాంశాలను ఆవిష్కరించే చిత్రమిది. నా కెరీర్‌లోనే ఎంతో బాధ్యతగా భావించి ఈ సినిమా చేశాను. విడుదల తేది పోస్ట్‌పోన్ అయిన నా సినిమాలన్నీ హిట్ అయ్యాయి. ఈ చిత్రం కూడా అదే కోవలో విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు. ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేశారు. ఆలస్యమైనా నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. మా పంపిణీదారుల సలహా మేరకు చిత్రాన్ని మే 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత రాజ్‌కుమార్ ఆకెళ్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకుడు ఠాగూర్ మధు పాల్గొన్నారు.

1097

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles