సుకుమార్ కథతో నిఖిల్

Tue,December 3, 2019 11:46 PM

నిఖిల్ కథానాయకుడిగా సూర్యప్రతాప్ (‘కుమారి 21ఎఫ్’ ఫేమ్) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుకుమార్, బన్నీ వాసు నిర్మాతలుగా వ్యవహరిస్తారు. జీఏ2పిక్చర్స్, సుకుమార్‌రైటింగ్స్ పతాకాలపై అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కనుంది. త్వరలో షూటింగ్ ప్రారంభంకానుంది. ‘ఈ సినిమా కోసం అద్భుతమైన కథ సిద్ధమైంది. సబ్జెక్ట్ విని నిఖిల్ ఎగ్జెట్ అయ్యాడు. అతని కెరీర్‌లో మైలురాయిలా నిలిచే చిత్రమవుతుంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అందరిని అలరించే చిత్రమిది. కథానుగుణంగా ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిస్తాం. ఈ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తాం’అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే సుకుమార్ అందిస్తున్నారు.
Nikhil-Siddharth
Bunny-Vasu
Surya-Pratap

270

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles