టైటిల్ మారింది!

Mon,February 4, 2019 10:45 PM

నిఖిల్ హీరోగా ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్‌ఎల్‌పీ పతాకాలపై రూపొందుతున్న తాజా చిత్రానికి అర్జున్ సురవరం అనే పేరును ఖరారు చేశారు. తొలుత ఈ చిత్రానికి ముద్ర అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఆ పేరును మార్చిన చిత్ర బృందం కొత్త టైటిల్ లోగోను సోమవారం విడుదలచేశారు. టి.ఎన్ సంతోష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య వేణుగోపాల్, రాజ్‌కుమార్ నిర్మిస్తున్నారు. లావణ్య త్రిపాఠి కథానాయిక. మార్చి 29న ఈ చిత్రం విడుదలకానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ నిజాయితీపరుడైన ఓ పాత్రికేయుడి కథ ఇది. నకిలీ ధృవపత్రాలతో విద్యార్థుల జీవితాలతో చలగాటమాడే ఓ ముఠా అక్రమాల్ని అర్జున్ సురవరం ఎలా వెలుగులోకి తీసుకొచ్చాడన్నది ఉత్కంఠభరితంగా ఉంటుంది. జర్నలిస్ట్‌గా నిఖిల్ పాత్ర నవ్యరీతిలో సాగుతుంది. యూరప్‌లో ఇటీవలే ఓ గీతాన్ని చిత్రీకరించాం. ఈ పాటతో సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం అని తెలిపారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, ప్రగతి, తరుణ్ అరోరా, సత్య ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సూర్య, సంగీతం: సామ్ సి.ఎస్.

1879

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles