రూమర్స్‌కు చెక్ పెట్టాలనే అలా అన్నారేమో!


Thu,March 28, 2019 11:12 PM

Niharika Konidela Stills From Suryakantham Movie Interview

పాత సినిమాల్లో సూర్యకాంతంగారి పాత్ర కుటుంబాల మధ్య స్పర్థలు వచ్చేలా ప్రవర్తిస్తుండేది. అయితే మా సినిమాలో నా పాత్ర అలా వుండదు. తన దాకా వస్తేగానీ ఏ విషయాన్నయినా పట్టించుకోదు. అలాగే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోదు. తనని ఎవరు కష్టపెట్టినా వారికి చుక్కలు చూపిస్తూ వుంటుంది అని తెలిపింది నిహారిక. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సూర్యకాంతం, ప్రణీత్ బ్రహ్మాండపల్లి రూపొందిస్తున్న ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గురువారం నిహారిక
హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించింది.

నా కెరీర్, జీవితం గురించి కొన్ని విషయాల్లో ఇలానే వుండాలని, 30 ఏళ్ల లోపే పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ సూర్యకాంతం పాత్ర మాత్రం అలా కాదు. నా చావు నేను చస్తా నీకెందుకు అనే విధంగా వుంటుంది. ఎవరికోసమో తను మారదు. మారాలని అనుకోదు. సూర్యకాంతం టైటిల్ ఎందుకు పెట్టారని చాలా మంది నన్ను అడిగారు. ఆ ఆలోచన దర్శకుడిదే. నేను, మా నాన్న కలిసి నాన్న కూచి అనే వెబ్ సిరీస్ చేశాం. అందులోని ఓ సన్నివేశంలో నా గురించి నాన్న చెప్పే సన్నివేశం వుంది. దాని కోసం దర్శకుడు మా అమ్మాయి సావిత్రిలా వుంటుందని రాశారు. అలా వుండదు. నాకు నచ్చినట్టు చెబుతానని మా అమ్మాయి సూర్యకాంతంలా వుంటుందన్నారు. విని షాకయ్యాను. అది మనసులో పెట్టుకున్నాడేమో దర్శకుడు ప్రణీత్ ఈ చిత్రానికి ఆ పేరే పెట్టాడు. ఈ సినిమా చూసుకున్న తరువాత నేను నెగెటివ్ పాత్రల్ని కూడా ప్రయత్నిస్తే బాగుంటుంది కదా అనిపించింది.

ఆ రెండూ మంచి కథలే..

ఒక మనసు, హ్యాపీవెడ్డింగ్ చిత్రాల్లో నటించడం నేను చేసిన తప్పిదంగా ఇప్పటికీ భావించను. ఎందుకంటే మంచి కథలు కాబట్టే ఆ రెండు చిత్రాల్లో నటించాను. హ్యాపీవెడ్డింగ్‌లోని నా పాత్రలో వున్న కాన్‌ఫ్లిక్ట్ ప్రతి అమ్మాయిలో వుంటుంది. ఈ సినిమా కెమిస్ట్రీ కుదరక ఫ్లాప్ అయిందా? లేక సరైన పంథాలో దాన్ని తెరపైకి తీసుకురాలేకపోవడంతో జరిగిన తప్పిదమా? అన్నది ఇంకా నాకు అర్థం కాలేదు. ఒక మనసు ఓ స్వచ్ఛమైన ప్రేమకథ. ఇలాంటి కథని ఈ జనరేషన్‌లో నేను ఇంత వరకు చూడలేదు. ఇది ఆడకపోవడానికి కారణం అనుకున్న రీతిలో తెరపైకి తీసుకురాలేకపోవడమే అనుకుంటున్నాను. ఈ రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయినా ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. మా పెదనాన్న చిరంజీవి కెరీర్ తొలి నాళ్లలో చాలా ఫ్లాపులు చూశానని చెప్పేవారు. అందుకే ఫ్లాపులు వచ్చినా పట్టించుకోలేదు. ఒక సినిమా ఫ్లాప్ అయితే ఒత్తిడికి లోనై, హిట్టయితే దాన్ని తలకెక్కించుకోవడం నాకు నచ్చదు.

ఆ రూమర్స్‌కు చెక్ పెట్టాలనే...

విజయ్ దేవరకొండ, నేను పెళ్లి చేసుకోబోతున్నామంటూ గత కొన్ని రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ రూమర్స్‌కు చెక్ పెట్టాలనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో నిహారికకు అన్నలా వచ్చానని విజయ్ దేవరకొండ అన్నారేమో అనిపించింది. తనని తొలిసారి ప్రీ రిలీజ్ వేడుకలోనే చూశాను. అంతకు ముందెన్నడూ చూడలేదు. సైరాలో పెదనాన్న చిరంజీవితో కలిసి నటించాను. పాత్ర చిన్నదే డైలాగ్‌లు మాత్రం వుండవు. నటిగా మంచి గుర్తింపును తెచ్చిపెడుతుంది.

2497

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles