శంకర్‌తో సయ్యాట


Mon,April 8, 2019 12:06 AM

nidhhi agerwal turns up the heat with special song in ram pothineni s ismart shankar

రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. డబుల్ దిమాక్ ఉపశీర్షిక. పూరి జగన్నాథ్ దర్శకుడు. నిధి అగర్వాల్, నభా నటేష్ కథానాయికలు. పూరిజగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం గేయ రచయిత కాసర్ల శ్యామ్ రాసిన దిమాక్ ఖరాబ్.. అనే గీతాన్ని చిత్రీకరిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ గీతం కోసం ప్రత్యేకంగా ఓ సెట్‌ని నిర్మించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు నృత్య రీతుల్ని సమకూరుస్తున్నారు. కథానాయిక నిధి అగర్వాల్‌తో పాటు వంద మంది డ్యాన్సర్స్ పాల్గొంటున్న ఈ పాట తెలంగాణ యాసలో సాగుతుంది.

మణిశర్మ స్వరాలు అందిస్తున్న ఈ పాట సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, చిత్రీకరణ సందర్భంగా సెట్‌కి వచ్చిన దర్శకుడు సుకుమార్ అభినందించారని, కొత్త పంథాలో సరికొత్త నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం వెల్లడించింది. పునీత్ ఇస్సార్, సత్యదేవ్, మిలింద్ గునాజి, సత్యదేవ్, ఆశిష్ విద్యార్థి, గెటప్ శ్రీను, సుధాంశు పాండే తదితరులు నటిస్తున్నారు.

1979

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles