నియమాలు స్త్రీలకేనా?


Mon,June 10, 2019 12:08 AM

Nick Jonas is missing wifey Priyanka Chopra as the actress

బాలీవుడ్ అగ్ర నాయికల్లో ఒకరైన ప్రియాంక చోప్రా, పాప్‌సింగర్, హాలీవుడ్ నటుడు నిక్‌జోనస్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య పదేళ్ల వయోభేదం ఉంది. ప్రియాంక కంటే నిక్‌జోనస్ పదేళ్లు చిన్నవాడు కావడంతో సోషల్‌మీడియాలో ఈ జంటపై కొందరు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. భార్య కంటే భర్త చిన్నవయస్కుడు కావడం సంప్రదాయానికి విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఈ విషయంపై ప్రియాంకచోప్రా ఘాటుగా స్పందించింది. స్వచ్ఛమైన ప్రేమకు కులమతాలు, వయోభేదాలు అడ్డురావని స్పష్టం చేసింది. తమకంటే చాలా చిన్న వయసున్న యువతుల్ని పెళ్లి చేసుకున్న మగవారిని ప్రశ్నించని ఈ సమాజం ఆడవాళ్లను లక్ష్యంగా చేసుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లయి ఇన్ని రోజులవుతున్నా మా ఇద్దరి మధ్య వయసు తేడా గురించి చర్చించుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తున్నది. ఒకవేళ నిక్ నాకంటే పదేళ్లు పెద్దవాడయ్యుంటే అసలు ఈ అంశం చర్చకు వచ్చేది కాదు. నియమాలు కేవలం ఆడవాళ్లకే వర్తిస్తాయా? పురుషులు వాటికి అతీతులా? స్త్రీలపై ఆంక్షలు ఇంకెన్నాళ్లు అని ప్రశ్నించింది ప్రియాంక. ఇద్దరు పరస్పరం గౌరవించుకుంటూ సౌకర్యవంతంగా జీవించడమే పెళ్లి ఉద్దేశ్యమని, వయోభేదాల గురించి చర్చే అనవసరమని పేర్కొంది.

1624

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles