సూర్య పాత్రను ఇష్టపడుతున్నారు


Tue,June 4, 2019 12:12 AM

ngk movie success movie success meet

ఎన్‌జీకేలో సూర్య నటన, పాత్ర చిత్రణకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ప్రథమార్థంలో హీరోగా, ద్వితీయార్థంలో విలన్‌గా భిన్న పార్శాలున్న పాత్రలో వైవిధ్యమైన నటనను ప్రదర్శించారని చెబుతున్నారు అని అన్నారు శ్రీ రాఘవ. ఆయన దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ఎన్‌జీకే. సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్ నాయకానాయికలుగా నటించారు. ఈ సినిమాను అదే పేరుతో సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ తెలుగు ప్రేక్షకులకు అందించారు. ఇటీవలే ఈ చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ రాఘవ మాట్లాడుతూ పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం చక్కటి ప్రారంభవసూళ్లను సాధిస్తున్నది. దర్శకుడిగా నాకు, హీరోగా సూర్యకు ఈ సినిమా మంచి సంతృప్తిని మిగిల్చింది. కథ, కథనాలు ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తున్నాయి. సాయిపల్లవి, రకుల్‌ప్రీత్ పాత్రలు వైవిధ్యంగా సాగుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి. సూర్యతో విభిన్నమైన పాత్ర చేయించారని అందరూ ప్రశంసిస్తున్నారు. ఆయన పాత్రను ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. యువన్ శంకర్‌రాజా నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నది అని తెలిపారు.

1200

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles