హృద్యమైన ప్రణయకథ


Sat,November 17, 2018 10:49 PM

next enti theatrical trailer released

తమన్నా, సందీప్‌కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం నెక్ట్స్ ఏంటి. బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ దర్శకత్వం వహిస్తున్నారు. నవదీప్, పూనమ్‌కౌర్ ముఖ్యపాత్రల్ని పోషించారు. శుక్రవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ భారతీయ సంస్కృతిని తెలియజెప్పే చిత్రమిది. తండ్రీ కూతురు మధ్య వచ్చే సన్నివేశాలు హృద్యంగా ఉంటాయి. సార్వజనీన అంశాలున్న కథాంశమిది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు. కథ వినగానే ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమాలో నా లుక్ చాలా బాగుంది.

కునాల్ కోహ్లీ నా పాత్రను వినూత్నంగా తీర్చిదిద్దారు. యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులందరికి నచ్చే చిత్రమిది అని సందీప్‌కిషన్ చెప్పారు. తమన్నా మాట్లాడుతూ నా మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉన్న పాత్ర చేస్తున్నాను. కథలో చక్కటి భావోద్వేగాలున్నాయి. సందీప్, నవదీప్‌తో నటించడం మంచి అనుభూతినిచ్చింది అని చెప్పింది. శరత్‌బాబు, పూనమ్‌కౌర్, లారిస్సా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మనీష్‌చంద్ర భట్, సంభాషణలు: గోపు కిషోర్‌రెడ్డి, సంగీతం: లియోన్‌జేమ్స్,నిర్మాతలు: రైనా జోషి, అక్షయ్‌పూరి.

2028

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles