యువ రైతు ప్రేమకథ


Fri,May 24, 2019 12:30 AM

new film ittu shooting begins on the banner of srija arts

అమీర్, శిరీష, అశ్విత నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ఇట్లు గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రోశిరెడ్డి పందిళ్లపల్లి దర్శకుడు. శ్రీజా ఆర్ట్స్ పతాకంపై రాజాగౌడ్, మెట్టయ్య పుప్పల, డా॥రఘు, డా॥ రాములు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పూజాకార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నటుడు నారాయణరావు క్లాప్‌నివ్వగా, శ్రీమతి వాణి కెమెరా స్విఛాన్ చేశారు. మద్దూరి వెంకటకృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతున్న యువ రైతు ప్రేమించి పెళ్లిచేసుకోవాలనుకుంటాడు. ఆ తరువాత అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయన్నదే ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. యాక్షన్, థ్రిల్లర్, రొమాన్స్ అంశాల్ని మిళితం చేసి తెరకెక్కిస్తున్న చిత్రమిది అన్నారు.

1289

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles