సైకలాజికల్ థ్రిల్లర్


Wed,May 8, 2019 12:24 AM

nenu lenu telugu movie will be released on may 24

హర్షిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నేను లేను. లాస్ట్ ఇన్ లవ్ ఉపశీర్షిక. రామ్‌కుమార్ ఎం.ఎస్.కె. దర్శకుడు. సుక్రికుమార్ నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తయింది. యు.ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 24న విడుదల కానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ అందమైన ప్రేమకథతో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. ఊహకందని మలుపులతో ప్రతిక్షణం ఉత్కంఠను పంచుతుంది. ఇటీవల విడుదలచేసిన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది. 7.5 మిలియన్ల మంది వీక్షించారు. రొమాన్స్, యాక్షన్, వినోదం హంగుల సమ్మిళితంగా సినిమా ఉంటుంది అని తెలిపారు. భారతీయ తెరపై ఇప్పటివరకు రాని సరికొత్త కథాంశమిదని హీరో హర్షిత్ చెప్పారు. వంశీకృష్ణ పాండ్య, శ్రీపద్మ, మాధవి, రుద్రప్రకాష్ వేల్పుల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఆశ్రిత్, ఛాయాగ్రహణం:ఎ.శ్రీకాంత్.

493

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles