కంటెంట్ వున్న చిత్రాలకే ఆదరణ!


Thu,July 11, 2019 12:32 AM

Nene Kedi No. 1 release of the film on the 26th

షకలక శంకర్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం నేనే కేడీ నెం.1. ముస్కాన్ కథానాయిక. ఆర్.ఎ.ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై జాని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ నెల26న విడుదల కానుంది. బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రైలర్ బాగుంది. మంచి కథకు మాస్ అంశాల్ని జోడించి దర్శకుడు చిత్రాన్ని రూపొందించినట్టు కనిపిస్తోంది. షకలక శంకర్ మంచి గుర్తింపు వుంది కాబట్టి ఈ చిత్రానికి ఓపెనింగ్స్ వస్తాయన్న నమ్మకముంది. చిన్న చిత్రాలు ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. పది మందికి పని దొరుకుతుంది. కంటెంట్ వున్న చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, బ్రోచే వారెవరురా చిత్రాల్లో కంటెంట్ వుంది కాబట్టే ఆడుతున్నాయి.

నిర్మాతలకు నేను చెప్పేది ఒక్కటే మంచి కథాబలమున్న చిత్రాల్ని నిర్మించండి. బడ్జెట్ పెరగకుండా చూసుకోండి. చిన్న చిత్రాల నిర్మాతల కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరు వరకు అవి ఓ కొలిక్కి వస్తాయి అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ మంచి ఎంటర్‌టర్‌టైన్‌మెంట్ నేపథ్యంలో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది. ప్రస్తుత సమాజంలో పిల్లలు చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారంటే దానికి కారణం తల్లిదండ్రులే. తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవడం లేదు. ఇదే విషయాన్ని ఈ చిత్రంలో చర్చించాం. మూడు భిన్నమైన పార్శాల్లో సాగే పాత్రలో షకలక శంకర్ కనిపిస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో షకలక శంకర్, అజయ్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.

492

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles