నాగకన్య ప్రేమకథ


Mon,May 20, 2019 11:32 PM

neeya 2 movie release on 24th of this month

గతంలో పాము కథాంశాలతో తెలుగు తెరపై వచ్చిన సినిమాలన్నీ ప్రతీకార నేపథ్యాలతో రూపొందాయి. వాటికి భిన్నంగా ఓ హృద్యమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమిది అని అన్నారు ఎల్.సురేష్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం నాగకన్య. జై, రాయ్‌లక్ష్మి, వరలక్ష్మిశరత్‌కుమార్, కేథరిన్ ప్రధాన పాత్రలను పోషించారు. తమిళంలో నీయా-2 పేరుతో రూపొందిన ఈ చిత్రాన్ని నిర్మాత కె.ఎస్.శంకర్‌రావు తెలుగులో అనువదిస్తున్నారు.. ఈ నెల 24న విడుదలకానుంది. దర్శకుడు ఎల్.సురేష్ మాట్లాడుతూ గతంలో తెలుగులో కళావర్‌కింగ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాను. తొమ్మిదేళ్ల విరామం తర్వాత నాగకన్యతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకురావడం ఆనందంగా ఉంది.

థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. గ్లామర్ హంగులకు తావులేని నటనకు ఆస్కారమున్న పాత్రలో రాయ్‌లక్ష్మి కనిపిస్తుంది. జై, వరలక్ష్మి, కేథరిన్ పాత్రలు కొత్తగా ఉంటాయి. ఐదు పాటలు, ఐదు పోరాట ఘట్టాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి అని అన్నారు. నలభై నిమిషాల పాటు సాగే గ్రాఫిక్స్ నవ్యానుభూతిని పంచుతాయి. కుటుంబమంతా కలిసి చూసే మంచి సినిమా ఇది అని నిర్మాత చెప్పారు.

888

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles