మొదలయ్యే ఎలా ఇలా..


Sun,February 10, 2019 11:57 PM

Nee Kosam Movie Song Launch

అరవింద్‌రెడ్డి, శుభాంగి పంత్, అజిత్ రాధారామ్ దీక్షిత, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం నీ కోసం. అవినాష్ కోకటి దర్శకుడు. తీర్థసాయి ప్రొడక్షన్స్ పతాకంపై అల్లూరమ్మ నిర్మిస్తున్న ఈ చిత్రంలోని మొదలయ్యే ఎలా ఇలా అంటూ సాగే పాటని ఆదివారం హైదరాబాద్‌లో నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఇదొక న్యూఏజ్ లవ్‌స్టోరీ. సున్నితమైన భావోద్వేగాలతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలన్నీ ఇందులో వున్నాయి. టాకీ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి చిత్రాన్ని మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం అన్నారు. గుండు సుదర్శన్, కేదార్ శంకర్, పూర్ణిమ, కల్పలత, మహేష్ విట్టా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీనివాసశర్మ, ఛాయాగ్రహణం: శివకృష్ణ, ఎడిటింగ్: తమ్మిరాజు,

483

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles