థాంక్యూ..నయన్‌!

Wed,October 23, 2019 12:57 AM

భాషా భేదాలతో సంబంధం లేకుండా మన కథానాయికల మధ్య చక్కటి అనుబంధాలు వెల్లివిరిస్తున్నాయి. అవసరమైన సందర్భాల్లో ఒకరికొకరు స్నేహహస్తాన్ని అందించుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. తాజాగా దక్షిణాది లేడీసూపర్‌స్టార్‌ నయనతార..బాలీవుడ్‌ కథానాయిక కత్రినాకైఫ్‌ నెలకొల్పిన ఓ సౌందర్య ఉత్పత్తుల వ్యాపార ప్రచార కార్యక్రమంలో భాగమయ్యారు. ఇందుకు సంబంధించిన చిన్న వీడియోను కత్రినాకైఫ్‌ సోషల్‌మీడియా ద్వారా పంచుకుంటూ నయనతారకు కృతజ్ఞతలు తెలిపింది. ‘తీరికలేని షూటింగ్‌లతో ఉండి కూడా నా బ్రాండ్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయికు వచ్చి యాడ్‌ చిత్రీకరణలో పాల్గొన్న దక్షిణాది అందాలతార నయనతారకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని కత్రినాకైఫ్‌ పేర్కొంది. ఇటీవలే ఆమె ‘కే బై కత్రినా’ పేరుతో బ్యూటీ ప్రొడక్ట్స్‌ వ్యాపారంలోకి అరంగేట్రం చేసింది. దీనికి సంబంధించిన ప్రమోషనల్‌ వీడియోలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు మెరిశారు. దక్షిణాది నుంచి నయనతార షూట్‌లో పాల్గొంది. ఇటీవలే విడుదలైన ‘సైరా’ చిత్రంలో సిద్ధమ్మ పాత్రలో నయనతార ప్రేక్షకుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఆమె విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘బిగిల్‌'తో పాటు రజనీకాంత్‌ ‘దర్బార్‌' చిత్రంలో నటిస్తున్నది.

712

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles