ప్రభుదేవాతో సినిమాకు నో!

Tue,March 21, 2017 12:04 AM

nayantara
గతంలో నయనతార, ప్రభుదేవా మధ్య చాలా కాలం పాటు ప్రేమాయణం సాగింది. 2008లో ఓ అవార్డు వేడుకలో వీరి మధ్య ఏర్పడిన పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. ఒకానొకదశలో వీరిద్దరు పెళ్లిచేసుకోబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఎలాంటి అరమరికలు లేకుండా నాలుగేళ్ల పాటు సజావుగా సాగిన వీరి అనుబంధానికి మనస్ఫర్థల కారణంగా ముగింపు పడింది. వీరి ప్రేమాయణానికి తెరపడి ఐదారేళ్లు గడిచినా ఇద్దరి మధ్య ఇంకా సఖ్యత కుదరలేదని సమాచారం.

ప్రణయబంధానికి వీడ్కోలు పలికిన తర్వాత ప్రభుదేవాకు దూరంగా ఉంటున్న నయనతార తాజాగా అతడితో కలిసి నటించడానికి విముఖతను వ్యక్తం చేసినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే...నయనతార ప్రధాన పాత్రలో తమిళంలో కొలయుతిర్ కాలమ్ పేరుతో ఓ చిత్రం తెరకెక్కతున్నది. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ప్రభుదేవాను తీసుకోవాలని చిత్ర వర్గాలు భావించాయి. వారి నిర్ణయాన్ని నయనతారతో పాటు ఆమె ప్రియుడు విఘ్నేష్ శివన్ వ్యతిరేకించినట్లు సమాచారం. ప్రభుదేవా నటిస్తే తాను ఈ సినిమా నుండి తప్పుకుంటానని చిత్ర వర్గాలకు నయనతార చెప్పిందని ఆ కారణంగానే అతడిని ఎంపిక చేయాలనే నిర్ణయాన్ని చిత్ర బృందం విరమించుకున్నట్లు సమాచారం.

1756

More News

మరిన్ని వార్తలు...