దర్బార్‌లో అడుగుపెట్టింది!


Tue,April 23, 2019 11:51 PM

nayanthara joins the sets of rajinikanths darbar

దక్షిణాదిలో అగ్ర కథానాయికగా తిరుగులేని ఇమేజ్‌ను సొంతం చేసుకుంది నయనతార. ఆమె నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాల్ని సొంతం చేసుకుంటున్నాయి. అటు తమిళంతో పాటు ఇటు తెలుగులో కూడా ఈ మలయాళీ సుందరికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె కథానాయికగా రజనీకాంత్ సరసన నటిస్తున్న తాజా చిత్రం దర్బార్. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకుడు. ఇందులో రజనీకాంత్ ఐపీఎస్ ఆఫీసర్‌గా, సామాజిక ఉద్యమకారుడిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముంబయిలో జరుగుతున్నది. తాజాగా ఈ సినిమా సెట్స్‌లో నయనతార అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమెకు స్వాగతం చెబుతూ చిత్ర బృందం సోషల్‌మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. షూటింగ్ తాలూకు కొన్ని ఫొటోలు కూడా సోషల్‌మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. అందులో నయనతార చీర కట్టుకొని సంప్రదాయ వస్త్రధారణతో కనిపిస్తున్నది. సుదీర్ఘ విరామం తర్వాత రజనీకాంత్‌తో నటిస్తున్నది నయనతార. వీరిద్దరి కలయికలో చంద్రముఖి కథానాయకుడు చిత్రాలు రూపొందాయి. ప్రస్తుతం నయనతార సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నది. తమిళంలో నాలుగు చిత్రాలు నిర్మాణదశలో ఉన్నాయి.

1036

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles