సైకో అంతం కోసం..


Tue,February 5, 2019 11:26 PM

Nayanthara Imaikkaa Nodiga titled Anjali CBI in Telugu version

నయనతార కథానాయికగా నటించిన తమిళ చిత్రం ఇమైక్క నోడిగల్ తెలుగులో అంజలి సిబిఐ ఆఫీసర్ పేరుతో అనువాదమవుతున్నది. ఆర్. అజయ్ జ్ఞానముత్తు దర్శకుడు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో నయనతార సీబీఐ అధికారిణిగా నటించింది. అథర్వ, రాశీఖన్నా ఇతర కీలక పాత్రల్లో నటించగా, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్‌కశ్యప్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. విజయ్ సేతుపతి అతిథి పాత్రలో కనిపించారు. విశ్వశాంతి క్రియేషన్స్ పతాకంపై సి.హెచ్.రాంబాబు, ఆచంట గోపీనాథ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 22న విడుదలకానుంది. వరుస హత్యలకు పాల్పడుతున్న ఓ సైకో కిల్లర్‌ను తుదముట్టించడానికి ధైర్యవంతురాలైన సీబీఐ అధికారిణి ఏం చేసిందన్నదే చిత్ర కథ అని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆర్.డి.రాజశేఖర్, సంగీతం: హిప్‌హాప్ తమిళ.

1051

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles