ద్విపాత్రాభినయంలో


Sun,March 17, 2019 11:43 PM

nayantara airaa release on 28 march

నయనతార తొలిసారిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం ఐరా. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ సంస్థలు నిర్మిస్తున్నారు. సర్జున్ దర్శకుడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 28న ఈ చిత్రం విడుదలకానుంది. దర్శకుడు మాట్లాడుతూ రెగ్యులర్ హారర్ సినిమాలకు భిన్నంగా సాగే సూపర్ నాచురల్ థ్రిల్లర్ ఇది. ఇంద్రుడి వాహనమైన ఐరావతం స్ఫూర్తితో టైటిల్ నిర్ణయించాం. నయనతార పాత్ర శక్తిని చాటిచెప్పే టైటిల్ ఇది. భవానీ, యమున అనే రెండు పాత్రల్లో నయనతార నటన అలరిస్తుంది. సాంకేతికంగా అత్యున్నతంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతూ ఉత్కంఠను పంచుతుంది అని తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ భవానీ అనే డీ గ్లామర్ పాత్రలో నయనతార లుక్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. హారర్, థ్రిల్లర్ హంగులతో పాటు కథలోని భావోద్వేగాలు మనసుల్ని హత్తుకుంటాయి. వేసవిలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే చక్కటి సినిమా ఇది అని చెప్పారు. యోగిబాబు, కలైయరసన్, మనోబాలా, వంశీకృష్ణ ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుదర్శన్ శ్రీనివాసన్, స్క్రీన్‌ప్లే: ప్రియాంక రవీంద్రన్.

2203
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles