బ్రతకడమే ఓ కల


Mon,March 25, 2019 03:27 AM

Nayantara Airaa New Movie Release Date 28Th

అందరికి సంతోషంగా బ్రతకడం ఒక కల. కానీ జీవితంలో సంతోషం అంటే ఏమిటో తెలియని నాకు బ్రతకడమే ఓ కల అంటూ ఐరా టీజర్‌లోని సంభాషణలు అందరిలో ఆసక్తిని కలిగిస్తున్నాయి అన్నారు నయనతార. ఆమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం ఐరా అదే పేరుతో ఈ నెల 28న విడుదలకానుంది. సర్జున్ దర్శకుడు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్, కేజేఆర్ స్టూడియోస్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నాయి. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇందులో నయనతార ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. ఆమె మధ్యతరగతి పాత్రలో అద్భుతమైన అభినయాన్ని కనబరిచారు. ఈ సినిమాలోని సంభాషణలు ప్రతి ఒక్కరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

హారర్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు ప్రేక్షకుల్ని కట్టిపడేసే భావోద్వేగాలున్న చిత్రమిది. ఎమోషనల్ ఫ్యామిలీ హారర్ చిత్రంగా సరికొత్త అనుభూతినిస్తుంది అన్నారు. భవానీ, యమున పాత్రల్లో నయనతార నటనకు అందరూ మంత్రముగ్ధులవుతారు. భవానీ పాత్రలో ఢీగ్లామర్‌లుక్ అందరిని ఆశ్చర్యపరుస్తున్నది. 300లకు పైగా థియేటర్లలో చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం అని నిర్మాతలు తెలిపారు.

నయన్‌ను చూస్తే దెయ్యాలు పారిపోతాయి
సీనియర్ తమిళ నటుడు రాధారవి...నయనతారపై చేసిన అనుచిత వ్యాఖ్యలు తమిళ చిత్రసీమలో దుమారాన్ని రేపుతున్నాయి. నయనతార నటించిన కోళయుథిర్ కాలం అనే సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాన్ని ఇటీవల చెన్నైలో నిర్వహించారు. ఈ సినిమా చిత్రీకరణ మధ్యలో ఆగిపోవడంతో దర్శకుడు, నిర్మాత కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాధా రవి మాట్లాడుతూ నయన్‌ను అందరూ లేడీసూపర్‌స్టార్ అని పిలుస్తున్నారు. ఎంజీఆర్, శివాజీగణేషన్‌లతో పోల్చుతున్నారు. అలాంటి పోలికలు బాధ కలిగిస్తున్నాయి. ఒకనాడు సినిమాలో దేవత పాత్రలు చేయాలంటే కేఆర్ విజయను తీసుకునేవారు. ఇప్పుడు ఎవరు పడితే వారు చేస్తున్నారు. నయనతార హారర్ చిత్రాల్లోనూ నటిస్తున్నారు.

నిజం చెప్పాలంటే నయన్‌ను చూస్తే దెయ్యాలు కూడా పారిపోతాయి అంటూ రాధారవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన వ్యాఖ్యలపై నయనతార ప్రియుడు విఘ్నేష్‌శివన్‌తో పాటు చిన్మయి శ్రీపాద, రాధికా శరత్‌కుమార్, వరలక్ష్మిశరత్‌కుమార్ సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధారవి ప్రవర్తన బాగోలేదని ఆయనతో చెప్పానని రాధిక వెల్లడించారు. సీనియర్ నటులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం సబబు కాదని విఘ్నేష్‌శివన్ అన్నారు. మహిళల్ని తక్కువ చేసి చులకనగా మాట్లాడటం పరిశ్రమలో సాధారణం అయిపోయిందని, మౌనంగా ఉండకుండా మహిళలందరూ కలిసికట్టుగా ఇలాంటి ఉద్యమించాలని వరలక్ష్మి శరత్‌కుమార్ పిలుపునిచ్చారు.

1185

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles