ప్రియుడితో సరదాగా..


Mon,September 18, 2017 11:02 PM

Nayanathara spotted with Alleged BF Nayanathara in New York

nayanatara
తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్, కథానాయిక నయనతార ప్రేమలో వున్న విషయం తెలిసిందే. అయితే తమ లవ్‌ఎఫైర్‌కు సంబంధించి ఇప్పటివరకు ఈ జంట పెదవి విప్పలేదు. తాజాగా వీరిద్దరు కలిసి తీసకున్న సెల్ఫీ ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. విఘ్నేష్ శివన్ సోమవారం పుట్టినరోజుని జరుపుకున్నాడు. ఈ వేడుకను నయనతార న్యూయార్క్‌లో గ్రాండ్‌గా ప్లాన్ చేసిందట. ఈ సందర్భంగా ప్రేమికులిద్దరు కలిసి న్యూయార్క్‌లో బ్రూక్లిన్ వంతెన దగ్గర సెల్ఫీ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. విఘ్నేష్‌శివన్ దర్శకత్వం వహించిన నానుమ్ రౌడీధాన్ చిత్రంలో నయనతార కథానాయికగా నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని చెబుతారు.

652

More News

VIRAL NEWS