ఉండిపోరాదే ప్రేమిక

Sat,January 12, 2019 11:11 PM

తరుణ్‌తేజ్, లావణ్య జంటగా నటిస్తున్న చిత్రం ఉండిపోరాదే. గోల్డ్ టైమ్ ఇన్ పిక్చర్స్ పతాకంపై డాక్టర్ లింగేశ్వర్ నిర్మిస్తున్నారు. నవీన్ నాయని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ ఇది. వినూత్నమైన కథ, కథనాలతో రూపొందిస్తున్నాం. ఓ జంట ప్రేమప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా ఉంటుంది. రాజమండ్రిలో తొలి షెడ్యూల్‌ను చిత్రీకరించాం. తదుపరి షెడ్యూల్‌ను ఈ నెల 28 నుండి బెంగళూరు, మైసూర్, కరీంనగర్, హైదరాబాద్‌లో తెరకెక్కిస్తాం. ప్రేమ, వినోదం, సెంటిమెంట్ అంశాల సమాహారంగా ఈ సినిమా ఉంటుంది. వాణిజ్య హంగులు పుష్కలంగా ఉంటాయి. కొత్తదనాన్ని కోరుకునే ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది అని తెలిపారు. కేదార్ శంకర్, సత్యకృష్ణన్, అల్లు రమేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాబు వర్గీస్, కెమెరామెన్: శ్రీను విన్నకొట.

1991

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles