పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్


Tue,April 16, 2019 12:17 AM

naveen chandra signs a new movie

నవీన్‌చంద్ర కథానాయకుడిగా యశాస్ సినిమాస్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్నది. వేణు మడికంటి దర్శకత్వం వహిస్తున్నారు. వి. మంజునాథ్ నిర్మాత. సోమవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు సుధీర్‌వర్మ క్లాప్‌నివ్వగా, కృష్ణచైతన్య కెమెరా స్విఛాన్ చేశారు. అనిల్ కృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా వేణు మడికంటి మాట్లాడుతూ వెంకటాపురం దర్శకుడిగా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. మరో వినూత్నమైన కథతో సినిమా చేయాలనే ఆలోచనతో కొంత విరామం తీసుకొని ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఓ ముఖ్యమంత్రి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని కథ రాసుకున్నాను. ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతిక్షణం ఉత్కంఠను పంచుతుంది.

నవీన్‌చంద్రను కొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది. జూన్ నుంచి వైజాగ్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం అని తెలిపారు. యశాస్ సంస్థపై తాను నిర్మిస్తున్న తొలి సినిమా ఇదని నిర్మాత చెప్పారు. నవీన్‌చంద్ర మాట్లాడుతూ రాంగ్‌ట్రాక్‌లో వెళుతున్న తన కెరీర్‌ను అరవిందసమేత చిత్రంతో దర్శకుడు త్రివిక్రమ్ గాడిన పెట్టారు. ఆ సినిమా తర్వాత మంచి పాత్రలు నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. ఈ సినిమాలో నేను కొత్తగా కనిపిస్తాను. విభిన్నమైన కథాంశాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. పాత్రకు అనుగుణంగా నా ఆహార్యం, బాడీలాంగ్వేజ్‌లో మార్పులు చేసుకోబోతున్నాను అని తెలిపారు. కోటశ్రీనివాసరావు, నాజర్, రావురమేష్, సుబ్బరాజు, బ్రహ్మాజీ, అవసరాల శ్రీనివాస్, జోగినాయుడు, రాజేంద్రన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సాయిప్రకాష్, సంగీతం: అచ్చు, ఎడిటింగ్: బొంతల నాగేశ్వరరెడ్డి.

593

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles