అభినవ కృష్ణార్జునీయం


Sun,January 14, 2018 11:56 PM

nani
భారతంలో కృష్ణార్జునులు కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపించారు. కృష్ణుడి గీతోపదేశంతో అర్జునుడు కార్యోన్ముఖుడై యుద్ధంలో విజయం సాధించాడు. ఇప్పుడు ఈ అభినవ కృష్ణార్జునులు ఏ లక్ష్యం కోసం పోరాడారు? అసలు వారి ఆశయాలు ఏమిటి? ఈ అంశాలన్నింటికి సమాధానమే కృష్ణార్జున యుద్ధం అన్నారు మేర్లపాక మురళి. ఆయన దర్శకత్వంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం కృష్ణార్జున యుద్ధం. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్‌మీర్ కథానాయికలు. వెంకట్ బోయనపల్లి సమర్పణలో సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల రానుంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను హీరో నాని ట్విట్టర్ ద్వారా పంచుకుని ఓ వీడియోను పోస్ట్ చేశారు. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ఎంసీఏను పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు. మనకు అన్నింటికన్నా పెద్ద పండుగ సంక్రాంతి. భోగి రోజున కృష్ణ, సంక్రాంతి రోజున అర్జున్ ఫస్ట్‌లుక్‌లను, కనుమ రోజు సినిమాలోని ఫస్ట్ సాంగ్‌ను మీరు చూడబోతున్నారు. ఇవన్నీ మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: హిప్ హాప్ తమిళ, ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, ఆర్ట్: సాయి సురేష్.

971

More News

VIRAL NEWS