కలల సాఫల్యం కోసం..


Tue,March 12, 2019 12:09 AM

natural star nanis jersey to be released on april 19th

ప్రతి ఒక్కరి హృదయాల్ని స్పృశించే కథాంశమిది. 36ఏళ్ల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి అర్జున్ అనే యువకుడు సాగించిన పోరాటం ఏమిటన్నదే చిత్ర ఇతివృత్తం. స్ఫూర్తివంతమైన కథతో అందరిని ఆకట్టుకుంటుంది అన్నారు గౌతమ్ తిన్ననూరి. ఆయన దర్శకత్వంలో నాని, శ్రద్ధశ్రీనాథ్ జంటగా నటిస్తున్న చిత్రం జెర్సీ. చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఇటీవల విడుదల చేసిన రెండు పాటలకు అద్భుతమైన స్పందన లభించింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. నానిని సరికొత్త పంథాలో ఆవిష్కరించే చిత్రమిది.

భారీస్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో చిత్ర కథ నడుస్తుంది. లక్ష్యసాధన కోసం ఓ క్రికెటర్ ప్రయాణానికి అద్దం పడుతుంది. వేర్వేరు కాలవ్యవధుల్లో కథ నడుస్తుంది. నాని పాత్ర భిన్న పార్శాల్లో సాగుతుంది అని దర్శకుడు తెలిపారు. సత్యరాజ్, రోనిత్‌శర్మ, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సను వర్గీస్, ఆర్ట్: అనివాష్ కొల్లా, ఎడిటర్: నవీన్‌నూలి, సమర్పణ: పీడీవీ ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: గౌతమ్‌తిన్ననూరి.

760

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles