86 వసంతాల తెలుగు సినిమా


Thu,May 16, 2019 12:09 AM

Naresh Superb Speech in 86 Vasanthalu Book Launch Event

‘తెలుగు సినీ పరిశ్రమకు ఎన్‌సైక్లోపీడియా లాంటి పుస్తకమిది. తెలుగు సినిమా ఎలా పుట్టిందనే అంశంతో పాటు చిత్రసీమలోని కష్టసుఖాల్ని కూలంకుషంగా ధర్మారావు ఇందులో రచించారు. చిత్రసీమలో అడుగుపెట్టేవారికి టెక్ట్స్‌బుక్‌లా ఉపయోగపడుతుంది’ అని అన్నారు తెలంగాణ ఎఫ్‌డీసీచైర్మన్‌ పి.రామ్‌మోహన్‌రావు. ఫిలిం అనలిటికల్‌ అండ్‌ అప్రిషియేషన్‌(ఫాస్‌) అధ్యక్షుడు కె. ధర్మారావు రచించిన ‘86 వసంతాల తెలుగు సినిమా’ పుస్తకాన్ని ఆయన బుధవారం హైదరాబాద్‌లో మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు బహుకరించారు. ఏమీ ఆశించకుండా ఆనందమే ప్రయోజనంగా భావించి ధర్మారావు రాసిన పుస్తకమిదని ప్రభుత్వ సలహాదారు రమణాచారి పేర్కొన్నారు. ‘చరిత్రలో నిలిచిపోయే పుస్తకమిది. ‘మా’ సభ్యులందరికి ఈ పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం’ అని ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ చెప్పారు. ఈ వేడుకలో మురళీమోహన్‌, విజయ్‌కుమార్‌, రావి కొండలరావు, ఎస్‌.వి.రామారావు, గీతాంజలి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

1225

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles