అంగట్లో ప్రజాస్వామ్యం!


Sat,May 11, 2019 12:10 AM

narayana murthys film democracy

ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది బ్రహ్మాస్త్రం. అలాంటి ఓటుని నోటుకు ఎలా అమ్ముకుంటున్నారో అంతా చూస్తున్నాం. ప్రజాస్వామ్యానికి వజ్రాయుధం లాంటి ఓటును అమ్ముకునే హక్కు ఏ వ్యక్తికీ లేనట్టే ప్రజల ఓటుతో గెలుపొందిన నేతలకు కూడా పార్టీల్ని ఫిరాయించే హక్కులేదు. కానీ అది జరుగుతోందా? లేదు. నోటు కోసం నేతలు, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఈ అంశాన్నే మా చిత్రంలో చూపిస్తున్నాను అన్నారు ఆర్. నారాయణమూర్తి. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం మార్కెట్లో ప్రజాస్వామ్యం. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరున విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువను తెలియజెప్పే చిత్రమిది. భవిష్యత్ తరాలకు ఓటు విలువను చెప్పాలనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాను. నేటి రాజకీయ వ్యవస్థని సమూలంగా ప్రక్షాళన చేయాలని చెబుతున్నాం.

ఓటుకు నోటుతో రాజకీయ నేతలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అలా గెలిచిన నాయకులు నోటు కోసం ఫిరాయింపులకు పాల్పడుతున్నారు. నేడు ప్రజాస్వామ్యం అంగట్లో సరుకైపోయింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తాం అన్నారు. ఎల్బీ శ్రీరామ్, కాశీవిశ్వనాథ్, గౌతంరాజు, కృష్ణనాయక్, విక్రమ్, నర్సయ్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి పాటలు: గద్దర్, గోరేటి వెంకన్న, సుద్దాల అశోక్‌తేజ, గవిగంటి రాజలింగం, కెమెరా:శ్రీనివాస్, ఎడిటింగ్: రామారావు, నిర్మాణ నిర్వహణ: రామకృష్ణారావు, కథ, కథనం, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి.

1257

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles