నిర్మాత నారా జయశ్రీదేవి కన్నుమూత


Wed,February 13, 2019 11:21 PM

Nara Jaya Sridevi Passes Away

సినీ నిర్మాత నారా జయశ్రీదేవి(58) బుధవారం ఉదయం హైదరాబాద్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. కన్నడ, తెలుగు భాషల్లో కలిపి దాదాపు 25 చిత్రాల్ని నిర్మించారామె. జయశ్రీదేవికి భర్త, కుమార్తె ఉన్నారు. పాత్రికేయురాలిగా జీవితాన్ని ప్రారంభించిన జయశ్రీదేవి సినిమాల పట్ల ఆసక్తితో నిర్మాతగా మారారు. తెలుగులో చిరంజీవి, అర్జున్ ప్రధాన పాత్రల్లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీ మంజునాథ చిత్రాన్ని నిర్మించారామె. భక్తిప్రధాన ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది. ఈ సినిమాతో పాటు తెలుగులో కృష్ణ హీరోగా చంద్రవంశం, విజయశాంతితో వందేమాతరం, కౌశిక్ బాబు, నాగార్జున, మోహన్‌బాబు ప్రధాన పాత్రల్లో జగద్గురు ఆదిశంకరాచార్య సినిమాల్ని నిర్మించారు జయశ్రీదేవి. కన్నడంలో నిశ్శబ్ద, నమ్ముర మందార హువే, హబ్బా, అమృతవర్షిణి, ముకుందా మురారి లాంటి చిత్రాలతో నిర్మాతగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. విష్ణువర్ధన్, అంబరీష్, ఉపేంద్ర, శివరాజ్‌కుమార్ వంటి అగ్ర కథానాయకులతో సినిమాల్ని నిర్మించి విజయాల్ని అందుకున్నారు. జయశ్రీదేవి అంత్యక్రియల్ని బెంగళూరులో నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

2064

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles