బొమ్మరిల్లుతో పోల్చుతున్నారు!


Sat,September 22, 2018 11:26 PM

Nannu Dochukunduvate Movie Success Meet

నిర్మాతగా నా తొలి చిత్రాన్ని క్లీన్ యు సర్టిఫికెట్‌తో ప్రేక్షకులముందుకు తీసుకురావడం గర్వంగా అనిపించింది. అన్ని కేంద్రాల్లో సినిమాకు ప్రేక్షకులు అద్భుతమైన ఆదరణ కనబరుస్తున్నారు అన్నారు సుధీర్‌బాబు. ఆయన కథానాయకుడిగా స్వీయనిర్మాణంలో నటించిన చిత్రం నన్ను దోచుకుందువటే. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడు. నభనటేష్ కథానాయిక. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకులముందుకొచ్చింది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను నిర్వహించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలు లభిస్తున్నాయి. ప్రేక్షకులు మౌత్‌టాక్ ద్వారా సినిమా గురించి అందరికి చెబతున్నారు. ఇదే నిజమైన విజయంగా భావిస్తున్నాను.

ఈ సినిమాలోని తండ్రీకొడుకు సెంటిమెంట్‌ను బొమ్మరిల్లు సినిమాతో పోల్చుతున్నారు. కథానాయిక నభ నటేష్ ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా క్లీన్ ఎంటర్‌టైనర్‌ను తీశానని అభినందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు. కలెక్షన్స్ చాలా బాగున్నాయి. తండ్రీకొడుకు మధ్య బంధాన్ని భావోద్వేగభరితంగా చూపించారని మెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరు సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడటం ఆనందంగా ఉంది అని దర్శకుడు చెప్పారు. సంగీత దర్శకుడిగా తెలుగులో తనకీ చిత్రం శుభారంభాన్నిచ్చిందని అజనీష్ లోక్‌నాథ్ ఆనందం వ్యక్తం చేశారు. తెలుగులో నాకు తొలిచిత్రమిది. మంచి నటనను కనబరిచానని ప్రశంసలొస్తున్నాయి అని కథానాయిక నభనటేష్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.

2469

More News

VIRAL NEWS