వినోదాల ప్రేమాయణం


Wed,September 5, 2018 12:32 AM

nannu dochukunduvate movie release on 21st

స్వీయ నిర్మాణంలో సుధీర్‌బాబు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం నన్ను దోచుకుందువటే. ఆర్.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ నెల 21న విడుదల కానుంది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ఈ సినిమాలో ఆఫీస్ స్టాఫ్ అందరిని భయపెట్టించే మేనేజర్‌గా సుధీర్‌బాబు పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. ఎప్పుడూ అల్లరి చేసే చలాకీ అమ్మాయి సిరి పాత్రలో కథానాయిక నభా నటేష్ నటించింది. ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం చక్కటి వినోదాన్ని పంచుతుంది. ఫీల్‌గుడ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌గా అందరిని అలరించే చిత్రమిది. టీజర్‌కు మంచి స్పందన లభించింది అన్నారు.

ఈ సినిమాకు మంచి కథ కుదిరింది. ఆద్యంతం హాస్యప్రధానంగా ఆకట్టుకుంటుంది. నా సొంత బ్యానర్‌లో నిర్మిస్తున్న తొలి చిత్రమిది. తప్పకుండా ప్రేక్షకుల్ని మెప్పిస్తుందనే విశ్వాసం ఉంది అని. హీరో సుధీర్‌బాబు చెప్పారు. నాజర్, తులసి, వేణు, రవివర్మ, జీవా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు, సంగీతం: అజనీష్ బి లోకనాథ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.ఎస్.నాయుడు

2322

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles