నాని చిత్రం మొదలైంది

Mon,February 18, 2019 11:24 PM

నాని కథానాయకుడిగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి కొరటాల శివ క్లాప్‌నివ్వగా, ఎన్.సుధాకర్‌రెడ్డి కెమెరా స్విఛాన్ చేశారు. శరత్‌మరార్ స్క్రిప్ట్‌ని అందజేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ వినోదంతో పాటు ఈ సినిమాలో ఓ ఆసక్తికరమైన అంశం ఉంటుంది. అదేమిటన్నది తెరపై చూస్తేనే బాగుంటుంది. సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాం అన్నారు. మొదటి నుంచి వైవిధ్యమైన కథాంశాలకు ప్రాధాన్యతనిస్తూ సినిమాల్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్ర కథ వినూత్నంగా ఉంది. మంగళవారం నుంచి నిర్విరామంగా చిత్రీకరణ జరుపుతాం అన్నారు.
Ravi-Shankar
కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌కురువిళ్లా, ప్రియదర్శి, వెన్నెల కిషోర్, సత్య తదితరుల నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్, మాటలు: వెంకీ, డార్లింగ్‌స్వామి, రచనా సహకారం: ముకుంద్‌పాండే, ప్రొడక్షన్ డిజైనర్: రాజీవన్, ఆర్ట్: రామ్‌కుమార్, ఎడిటింగ్: నవీన్‌నూలి, వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్: సనత్, నిర్మాతలు: నవీన్ ఏర్నేని, వై.రవిశంకర్, సీవీ మోహన్ (సీవీఎం), కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విక్రమ్ కె కుమార్.

1791

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles