అర్జున్.. వయసు 36


Sat,January 12, 2019 11:17 PM

nani starrer jersey movie teaser review

అర్జున్ వయసు ముప్ఫై ఆరు ఏళ్లు. ప్రొఫెషనల్స్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే వయసు అది. ఆ ఏజ్‌లో క్రికెటర్‌గా గొప్ప పేరుతెచ్చుకోవాలని కలలుకంటాడతడు. పిల్లలను ఆడించే వయసులో ఈ ఆటలు ఎందుకని స్నేహితులంతా అర్జున్‌ని నిరుత్సాహపరుస్తారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా క్రికెటర్‌గా మారాలన్న తన కలను అర్జున్ ఎలా సాకారం చేసుకున్నాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జెర్సీ. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. శనివారం టీజర్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో క్రికెటర్‌గా గుర్తింపు కోసం ఆరాటపడే వ్యక్తిగా నాని కనిపిస్తున్నారు. ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు. కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు అంటూ టీజర్‌లో నాని చెప్పిన సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. క్రికెట్ నేపథ్యంలో 1996-97 కాలంనాటి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతున్నది. ఏప్రిల్‌లో సినిమా విడుదలకానుంది.

4104

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles