‘టక్ జగదీష్’గా నాని

Tue,December 3, 2019 11:45 PM

నాని కథానాయకుడిగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందించబోతున్న చిత్రానికి ‘టక్..జగదీష్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రీతూవర్మ కథానాయిక. షైన్‌వూస్కీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌పెద్ది నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ లుక్‌ను మంగళవారం విడుదల చేశారు. ఇందులో పంటపొలాలు, విండ్‌మిల్స్ బ్యాక్‌క్షిగౌండ్‌లో నాని పల్లెటూరి యువకుడిగా కనిపిస్తున్నారు. 202కైపథమార్థంలో ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ మొదలుకానుంది. ‘నిన్నుకోరి’ తర్వాత దర్శకుడు శివ నిర్వాణ, నాని కలయికలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. ఇందులో ఐశ్వర్యారాజేష్ మరో నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రానికి సినిమాటోక్షిగఫీ: ప్రసాద్ మూరెళ్ల, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, ఆర్ట్: సాహి సురేష్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: శివ నిర్వాణ.

274

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles