గ్యాంగ్ లీడర్ డేట్ ఫిక్స్


Fri,August 9, 2019 11:45 PM

Nani and Vikram K Kumar Gang Leader on September 13

విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాని నటిస్తున్న చిత్రం నానీస్ గ్యాంగ్ లీడర్. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సీవీఎం) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ నాని, విక్రమ్‌కుమార్ కలయికలో వస్తున్న వైవిధ్య చిత్రమిది. పూర్తి కమర్షియల్ అంశాలతో, విభిన్నమైన కాన్సెప్ట్‌తో దర్శకుడు పూర్తి జనరంజకంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో ప్రేక్షకులు ఆశించే కొత్తదనం ఈ చిత్రంలో వుంటుంది. ఇటీవల విడుదలైన ప్రీ లుక్‌కి, ఫస్ట్‌లుక్‌కి, టీజర్‌కు అందరి నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. సినిమాలో వుండే కొత్తదనం కూడా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే విశ్వాసం వుంది అని తెలిపారు. ఆర్‌ఎక్స్ 100 కార్తికేయ, ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి,రఘుబాబు, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచందర్, మాటలు: వెంకీ, సి.ఇ.ఓ: చెర్రీ.

528

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles