క్రికెట్‌పై మళ్లీ ఇష్టం పెరిగింది!


Tue,April 9, 2019 11:23 PM

nani and team becoming busy in jersey promotions

హృదయాల్ని హత్తుకునే అందమైన చిత్రమిది. నా కెరీర్‌లో మ్యాజికల్ సినిమాగా నిలుస్తుంది. నన్ను నేను పూర్తిగా మర్చిపోయి చూసిన సినిమా ఇది అని అన్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జెర్సీ. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. శ్రద్ధాశ్రీనాథ్ కథానాయిక. ఈ నెల 19న ఈ చిత్రం విడుదలకానుంది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో నాని మాట్లాడుతూ సినిమాలో అర్జున్ పాత్రతో ప్రతి ఒక్కరూ సహానుభూతి చెందుతారు. ఇరవైసార్లు ఈ సినిమా చూశాను. నటుడిగా నాకు పరిపూర్ణంగా సంతృప్తిని మిగిల్చింది. క్రికెట్ ప్రధానంగా తెరకెక్కిన చిత్రమని అందరూ అనుకుంటున్నారు. కానీ అంతకుమించిన భావోద్వేగాలు ఈ సినిమాలో ఉంటాయి. షూటింగ్ చివరి రోజు ఓ ప్రాణమిత్రుడికి వీడ్కోలు పలుకుతున్న అనుభూతి కలిగింది. అంతగా అర్జున్ పాత్రను ప్రేమించాను.

సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిన తర్వాత క్రికెట్ చూడటం మానేశాను. ఈ సినిమా కోసం ఆడటం మొదలుపెట్టిన తర్వాత క్రికెట్‌పై మళ్లీ ఇష్టం మొదలైంది. రంజీ బ్యాక్‌డ్రాప్‌లో కథ సాగుతుంది. ఇందులో 36 ఏళ్ల క్రికెటర్‌గా కనిపిస్తాను. క్రికెట్ ఆటను అత్యంత సహజంగా ఆవిష్కరించిన తెలుగు సినిమా ఇదే. అర్జున్ పాత్ర నిజజీవితంలో మనకు పరిచయం ఉన్న వ్యక్తిలా గోచరిస్తుంది. ఓ హైదరాబాదీ క్రికెటర్ జీవితంలో 1986, 96, 2018.. మూడు కాలాల వ్యవధుల్లో ఏం జరిగిందన్నది ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపే మంచి కథను చెబుతుండటం గర్వంగా ఉంది అనితెలిపారు. ఈ నెల 12న థ్రియేట్రికల్ ట్రైలర్‌ను, 15న ప్రీరిలీజ్ వేడుకను నిర్వహిస్తాం. ముందుగా నిర్ణయించినట్లుగానే ఈ నెల 19న సినిమాను విడుదలచేస్తాం. తెలుగులో కొత్త తరహా కథాంశంతో సినిమా చేయడం ఆనందంగాఉంది అని నిర్మాత పేర్కొన్నారు.

2052

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles