వయొలెన్స్ కావాలన్నారుగా..

Tue,November 5, 2019 12:12 AM

నాని, సుధీర్‌బాబు కథానాయకులుగా నటిస్తున్న తాజా చిత్రం వి. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. నివేదా థామస్, అదితిరావు హైదరీ కథానాయికలు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఉగాది కానుకగా వచ్చే ఏడాది మార్చి 25న ప్రేక్షకులముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ నాని 25వ చిత్రం మా బ్యానర్‌లో రూపొందుతుండటం ఆనందంగా ఉంది. ఇప్పటికే ఎనభైశాతం చిత్రీకరణ పూర్తయింది. రెండు ఫైట్స్, ఓ పాట మాత్రమే బ్యాలెన్స్‌గా ఉంది. ఇందులో నాని పాత్ర చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది. పోలీస్, రౌడీ నేపథ్యంలో జరిగే యాక్షన్ డ్రామా ఇది అన్నారు. ఈ సినిమా గురించి నాని ట్విట్టర్‌లో వయొలెన్స్ కావాలన్నారుగా..ఇస్తా...ఉగాదికి సాలిడ్‌గా ఇస్తా అంటూ స్పందించారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: అమిత్‌త్రివేది, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్.

670

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles