ైస్టెలిష్ యాక్షన్ థ్రిల్లర్!


Fri,January 11, 2019 11:15 PM

nandamuri kalyanram 118 movie release date

నందమూరి కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 118. ప్రముఖ ఛాయాగ్రహకుడు కె.వి.గుహన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నివేదా థామస్, షాలిని పాండే కథానాయికలుగా నటిస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత మహేష్ కోనేరు మాట్లాడుతూ ఈ చిత్ర టైటిల్ లోగో, ఫస్ట్‌లుక్, టీజర్‌ను ఇప్పటికే విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. కల్యాణ్‌రామ్ లుక్‌తో పాటు సినిమా ఏ జోనర్‌లో వుండనుందో టీజర్ ద్వారానే చెప్పేశాం. ైస్టెలిష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. సీట్ చివరి కూర్చుని చూసేలా వుంటుంది. కల్యాణ్‌రామ్ ఇప్పటి వరకు చేయని జోనర్ చిత్రమిది. వెంకట్, అన్బరివు, రియల్ సతీష్‌ల నేతృత్వంలో చిత్రీకరించిన యాక్షన్ పార్ట్ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. చాలా సినిమాలకు అద్భుతమైన విజువల్స్‌ని అందించిన కె.వి.గుహన్ ఈ చిత్రాన్ని ఆద్యంతం రసవత్తరంగా తెరకెక్కించారు. ైస్టెలిష్ యాక్షన్ థ్రిల్లర్‌లని ఇష్టపడే ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది అన్నారు.

1972

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles