దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా..


Wed,April 24, 2019 11:58 PM

Nandamuri hero of Devineni Nehru

నందమూరి తారకరత్న కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం దేవినేని. శివనాగు దర్శకుడు. ఆర్.టి. ఆర్. ఫిలింస్ పతాకంపై రాము నాథోడ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దివంగత రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం తారకరత్నపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ నివ్వగా, ప్రముఖ సీనియర్ నటి జమున కెమెరా స్విఛాన్ చేశారు. సీనియర్ పాత్రికేయులు యు. వినాయకరావు గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ మాట్లాడుతూ దేవినేని నెహ్రూ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. మిగతా పాత్రల్లో పేరున్న వాళ్లు నటిస్తున్నారు. 1977 నేపథ్యంలో కథ మొదలవుతుంది. సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయాలనుకుంటున్నాం. మే 10 నుంచి చిత్రీకరణ మొదలవుతుంది అన్నారు. తారకరత్న మాట్లాడుతూ దేవినేని నెహ్రూ మా కుటుంబానికి ఎంతో సన్నిహితులైనవ్యక్తి. పెదనాన్నలాంటి వారు. అలాంటి ఆయన పాత్రలో నటించడం ఆనందంగా వుంది అన్నారు.

1011

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles