మహానాయకుడి కథ


Sun,February 17, 2019 12:33 AM

nandamuri balakrishna starrer ntr mahanayakudu trailer released

నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఎన్టీఆర్. నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ఎన్.బి.కె.ఫిల్మ్స్, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా పతాకంపై నందమూరి బాలకృష్ణ నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని రిలీజ్ చేసిన చిత్ర బృందం ఈ నెల 22న రెండవ భాగమైన ఎన్టీఆర్ మహానాయకుడును ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సెన్సార్ పూర్తయింది. క్లీన్ యు సర్టిఫికెట్ లభించింది. నందమూరి తారకరామారావు రాజకీయ జీవితం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. విద్యాబాలన్, నందమూరి కల్యాణ్‌రామ్, దగ్గుబాటి రానా, సుమంత్ కీలక పాత్రల్లో నటించారు. దర్శకుడు క్రిష్ చిత్రాన్ని తెరకెక్కించారు అని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం. కీరవాణి, ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్, మాటలు: సాయిమాధవ్ బుర్రా, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, కాస్ట్యూమ్ డిజైనర్: ఐశ్వర్య రాజేష్.

3321

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles