తెలుగులో అరంగేట్రం


Mon,March 25, 2019 12:17 AM

Nana Patekar the most unexpected Villain for Allu Arjun

ప్రయోగాత్మక ఇతివృత్తాలతో బాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్నారు నానా పటేకర్. సహజ నటనతో హిందీ చిత్రసీమలో ఎన్నో గొప్ప పాత్రలకు ప్రాణప్రతిష్టచేసిన ఆయన టాలీవుడ్‌లో అరంగేట్రం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నానా పటేకర్ నటించబోతున్నట్లు చెబుతున్నారు. కథానుగుణంగా విలన్ పాత్ర విభిన్నంగా సాగుతూ నటనకు ప్రాధాన్యం ఉండటంతో చిత్రబృందం నానాపటేకర్‌ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లిగా టబు కీలక పాత్రను పోషించనున్నట్లు తెలిసింది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో సెట్స్‌పైకి రానుందని చెబుతున్నారు.

719

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles