గట్టిగా అనుకుంటే అన్నీ జరుగుతాయి!


Fri,September 21, 2018 11:35 PM

Nagarjuna Nani Rashmika Mandanna and Samantha at Devadas Movie audio launch

నాగార్జున, నాని కథానాయకులుగా నటిస్తున్న చిత్రం దేవదాస్. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. రష్మిక మందన్న, ఆకాంక్షసింగ్ కథానాయికలు. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక గురువారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. నాగార్జున మాట్లాడుతూ 1953లో దేవదాస్ సినిమా విడుదలైంది. ఇప్పుడు మళ్లీ దేవదాస్ వస్తోంది. నాన్నగారు బ్రతికే వున్నారు అనడానికి ఇదొక్కటి చాలు. అభిమానుల గుండెల్లో ఎప్పటికీ బతికే వుంటారు. కథ, అశ్వనీదత్, నానిల కోసమే ఈ సినిమా చేశా. నేను అనుకున్నవన్నీ జరుగుతుంటాయి. గట్టిగా అనుకుంటే జరిగిపోతుంటాయి. మల్టీస్టారర్ చేస్తే నానితోనే చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. నాని డైలాగులు వింటే ఓ పాట విన్నట్లు ఉంటుంది. దేవదాస్‌కు సీక్వెల్ చేయాలని వుంది అన్నాను అన్నారు. నాని మాట్లాడుతూ నాగ్ సార్ సినిమాలెప్పుడు చూసినా ఆయనేం తింటాడు? ఏం తాగుతాడు? అనే చర్చించుకునేవాళ్లం. అందుకే ఆయన సెట్లో ఏం తింటున్నారో గమనించేవాడిని. మనసులో ఏమీలేకుండా స్వచ్ఛంగా వుంటారు కాబట్టే అంత అందంగా వుంటారనిపించింది. ఈ సినిమా చూసి నాగ్ సార్ నాకు చెప్పిన మాటలు చాలు. ఈ సినిమాతో నేను సాధించినట్టే అన్నారు. నిర్మాత సి.అశ్వనీదత్ మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు గారిని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమం జరపడం ఆనందంగా వుంది. నా అభిమాన హీరో నాగార్జున.

మంచి మిత్రుడు నాని కలయికలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. శ్రీరామ్ ఆదిత్య లాంటి యువ దర్శకులు సినీపరిశ్రమకు రావడం మంచి శకునంఅన్నారు. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య మాట్లాడుతూ వైజయంతీ మూవీస్‌లో పనిచేయడం గర్వంగా వుంది. నాగార్జునతో పనిచేయడం గొప్ప అవకాశం. ఆయన సెట్‌లో ఉన్నారంటే నాకు థ్రిల్‌గా అనిపిస్తుంది. ఆయనతో సినిమా చేయాలన్న కోరిక ఈ సినిమాతో తీరింది అన్నారు. ఈ కార్యక్రమంలో సమంత, అఖిల్, రష్మిక మందన్న, ఆకాంక్షసింగ్, టి.సుబ్బిరామిరెడ్డి, నాగ్‌అశ్విన్, అమల తదితరులు పాల్గొన్నారు.

3330

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles