మన్మథుడు-2 మొదలైంది!


Tue,March 26, 2019 01:23 AM

Nagarjuna manmadhudu 2 movie shooting start

నాగార్జున సినీ కెరీర్‌లో మన్మథుడు చిత్రానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఆహ్లాదకరమైన హస్యం, హృద్యమైన భావోద్వేగాలు కలబోసిన ప్రేమకథగా ఆబాలగోపాలన్ని అలరించిందీ చిత్రం. తాజాగా ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని మన్మథుడు-2 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రాహుల్వ్రీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై నాగార్జున అక్కినేని, పి.కిరణ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో లాంఛనంగా ప్రారంభమైంది. అమల అక్కినేని ముహూర్తపు సన్నివేశానికి క్లాప్‌నివ్వగా, నాగచైతన్య కెమెరా స్విఛాన్ చేశారు.

త్వరలో యూరప్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఆద్యంతం హాస్యరస ప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాం. చైతన్యభరద్వాజ్ (ఆర్.ఎక్స్.100ఫేమ్) సంగీతాన్నందిస్తారు అని నిర్మాతలు తెలిపారు. రకుల్‌ప్రీత్‌సింగ్, లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, స్క్రీన్‌ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్, ఎడిటర్స్: ఛోటా కె ప్రసాద్, బి.నాగేశ్వరరెడ్డి, సంభాషణలు: కిట్టు విస్సాప్రగడ, రాహుల్ రవీంద్రన్, దర్శకత్వం: రాహుల్వ్రీంద్రన్.

1297

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles