లవ్ యూ స్వీట్‌హార్ట్


Wed,September 13, 2017 12:02 AM

Nagarjuna congratulates Amala on Twitter on her birthday

NAGAMALA
అన్యోన్య దాంపత్యానికి అందమైన ప్రతీకలా గోచరిస్తారు నాగార్జున-అమల. ఒకప్పుడు వెండితెరపై కన్నులపండువగా అలరించిన ఈ జోడీ తమ వైవాహిక జీవితంలో కూడా అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదిలావుండగా మంగళవారం తన ప్రియసహచరి అమల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నాగార్జున ఆమెకు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలందజేశారు. ఐ లవ్ యూ స్వీట్‌హార్ట్...నీ సాంగత్యంలో ఇలాంటి మధురమైన రోజులు ఎన్నో రావాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే అంటూ నాగార్జున ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమాలకు దూరంగా వుంటున్న అమల బ్లూక్రాస్ సంస్థ ద్వారా సమాజ సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. సామాజిక రుగ్మతలపై పోరాడేందుకు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఈ ఏడాది అమల కేరాఫ్ సైరాభాను అనే మలయాళ చిత్రంలో నటించింది.

558

More News

VIRAL NEWS

Featured Articles