ఉగాదికి శ్రీకారం


Tue,March 13, 2018 01:13 AM

Nagarjuna And Nani Multistarer Movie  Vyjayanthi Movie

NAGARJUNA.jpg
నాగార్జున, నాని కథానాయకులుగా వైజయంతీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందించబోతున్న విషయం తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 18నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెడుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత అశ్వనీదత్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ప్రస్తుతం మణిశర్మ సంగీత సారథ్యంలో అమెరికాలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి.
NANI.jpg
మూడు పాటలకు రూపకల్పన చేస్తున్నాం. మా సంస్థలో వచ్చిన మల్టీస్టారర్ చిత్రాలన్ని చక్కటి ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమాకు అద్భుతమైన కథ కుదిరింది అన్నారు. వినోదప్రధానంగా సాగే వినూత్న కథాంశమిది. నాగార్జున, నాని పాత్ర చిత్రణలు నవ్యపంథాలో సాగుతాయి. వైజయంతీ సంస్థలో మల్టీస్టారర్ చేయడం ఆనందంగా వుంది అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శ్యామ్‌దత్, స్క్రిప్ట్ అడ్వైజర్: సత్యానంద్, మాటలు: వెంకట్ డి, శ్రీరామ్, సంగీతం: మణిశర్మ, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: టి. శ్రీరామ్ ఆదిత్య.

1405

More News

VIRAL NEWS