మన్మథుడి అవంతిక


Tue,July 9, 2019 11:59 PM

Nagarjuna Akkineni Manmadhudu 2 Shoot Completed Release On August 9th

నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం మన్మథుడు-2. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. నాగార్జున, జెమిని కిరణ్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగ్ పాత్ర తాలూకు టీజర్‌ను మంగళవారం విడుదల చేశారు. అవంతికగా రెండు భిన్న పార్శాల్లో ఆమె టీజర్‌లో సందడి చేసింది. దర్శకుడు మాట్లాడుతూ పెళ్లి వయసు దాటిపోయిన ఓ బ్రహ్మచారి కథ ఇది. అవంతిక అనే అందాలభామతో ఆయన ప్రేమాయణం ఏంటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. నవ మన్మథుడి లీలలు ప్రేక్షకులకు చక్కటి వినోదాన్ని పంచుతాయి.

చైతన్ భరద్వాజ్ సంగీతాన్నందించిన ఈ చిత్ర గీతాల్ని త్వరలో విడుదల చేస్తాం అన్నారు. లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్, సంభాషణలు: కిట్టు విస్సాప్రగడ, రాహుల్ రవీంద్రన్, స్క్రీన్‌ప్లే: రాహుల్ రవీంద్రన్, సత్యానంద్, నిర్మాణ సంస్థలు: మనం ఎంటర్‌ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వయాకామ్ 18స్టూడియోస్, దర్శకత్వం: రాహుల్ రవీంద్రన్.

1403

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles