నాగకన్య రహస్యం


Tue,March 26, 2019 01:19 AM

Nagakanya movie release on April 5th

వరలక్ష్మి శరత్‌కుమార్, కేథరీన్, లక్ష్మిరాయ్ ప్రధాన పాత్రల్లో తాజా చిత్రం నాగకన్య. జై కథానాయకుడు. ఎల్.సురేష్ దర్శకత్వం వహించారు. జంబో సినిమాస్ పతాకంపై ఏ.శ్రీధర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 5న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలు తెలియజేస్తూ నాగకన్య నేపథ్యంలో రూపొందించిన చిత్రమిది. ప్రతీకారం అనే అంశం ప్రధానంగా కథ సాగుతుంది. నాగకన్య రహస్యం ఏమిటన్నది ఉత్కంఠను పంచుతుంది. గ్రాఫిక్స్ అబ్బురపరిచేలా ఉంటాయి. అంతర్లీనంగా ఈ చిత్రంలో చక్కటి ప్రేమకథ ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. కథానాయికలు వరలక్ష్మి శరత్‌కుమార్, లక్ష్మిరాయ్ పోటాపోటీ నటనను కనబరిచారు. ఆడియోకు మంచి స్పందన లభిస్తున్నది. వినూత్న కథాంశంతో రూపొందిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది అన్నారు.

2289

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles