అశ్వద్ధామగా నాగశౌర్య?


Wed,June 5, 2019 12:06 AM

naga shourya latest movie titled ashwathama

కొంత విరామం తరువాత యువ హీరో నాగశౌర్య మళ్లీ స్పీడు పెంచారు. సమంత కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం ఓ బేబీ. నందినిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. దీనితో పాటు సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు రూపొందిస్తున్న చిత్రంలోనూ నటిస్తున్న నాగశౌర్య సొంత నిర్మాణ సంస్థలో ఓ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే. తానే స్వయంగా కథ అందిస్తున్న ఈ చిత్రం ద్వారా రమణతేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. కొత్త తరహా కథ, కథనాలతో సాగే ఈ చిత్రానికి అశ్వద్ధామ అనే టైటిల్‌కు ఖరారు చేయాలనే ఆలోచనలో వున్నట్లు తెలిసింది. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే వెల్లడించే అవకాశం వుంది.

770

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles