ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి?


Tue,March 12, 2019 11:55 PM

naga shourya avasarala srinivas movie interesting title falana abbaayi falana ammayi

నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్‌ల కలయిలో ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. మూడవసారి వీరిద్దరి కలయికలో మరో సినిమా త్వరలో పట్టాలెక్కబోతున్నది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, దాసరి పద్మజ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా మాళవికా నాయర్ నటించనుంది. సున్నితమైన భావోద్వేగాల సమాహారంగా సాగే ఈ చిత్రానికి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అనే టైటిల్‌ని చిత్ర బృందం ఖరారు చేసినట్లు తెలిసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాల్ని త్వరలో చిత్ర బృందం వెల్లడించనుంది.

586

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles